Site icon Prime9

Revanth Reddy: సింగరేణి కాలనీలో పసిబిడ్డకే కాదు.. సీఎం కార్యాలయంలో మహిళా ఐఏఎస్ కు భద్రత లేదు

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్థరాత్రి ఓ డిప్యూటీ తహసీల్దార్ చొరబడటంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy) స్పందించారు.

రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు స్మితా సబర్వాల్ సంఘటన అద్దం పడుతుందని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శికే రక్షణ లేకపోతే.. ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మినిమమ్ గవర్నెన్స్.. మ్యాగ్జిమమ్ పాలిటిక్స్

‘ సీఎం కార్యదర్శి ప్రాణాలకే రక్షణ లేదు అంటే కేసీఆర్ ఎవరిని కాపాడుతారు. ఇంటికి తాళాలు వేసుకుని లోపల భయం భయంగా బతకండి అని స్మితా సబర్వాల్ అనడం..

రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదనడానికి నిదర్శనం. స్మితా సబర్వాల్ ఏమో 100 కి డయల్ చేయండి అంటుంది.. సీఎం కేసీఆర్ ఏమో 100 పేపర్స్ అంటున్నారు.

తెలంగాణ మోడల్ అంటే మినిమమ్ గవర్నెన్స్.. మ్యాగ్జిమమ్ పాలిటిక్స్ అన్నట్టు తయారైంది. ఆడబిడ్డ మానప్రాణాలకి రక్షణ కల్పించండి.

సింగరేణి కాలనీలో ఆరేళ్ల పసిబిడ్డకే కాదు.. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే మహిళా ఉన్నతాధికారిణికి భద్రత లేని పాలనలో ఉన్నాం.

ఆడబిడ్డలూ.. తస్మాత్ జాగ్రత్త’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

 

అసలేం జరిగిదంటే..

విశ్వసనీయ సమాచారం మేరకు.. సోషల్ మీడియాలో స్మితా సబర్వాల్(Smita Sabharwal) చురుగ్గా ఉంటారు.

అయితే ఆమె చేసే ట్వీట్లకు మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి(48) ఒకట్రెండు సార్లు రీట్వీట్లు చేశాడు.

ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో కారులో నేరుగా ఆమె ఉండే ఇంటి దగ్గరకు వెళ్లాడు. ఆ టైంలో తన స్నేహితుడైన ఓ హోటల్ యజమానిని వెంట తీసుకెళ్లాడు.

తాను ఫలానా క్వార్టర్కు వెళ్లాలని ఎంట్రీలోని సెక్యూరిటీ సిబ్బందికి జంకు లేకుండా చెప్పడంతో అనుమానించని వారు లోపలికి వెళ్లేందుకు అనుమతించారు.

స్నేహితుడిని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్ మాత్రం ఆమె ఇంటి దగ్గరకు వెళ్లాడు.

ముందు ఉన్న స్లైడింగ్ డోర్ తెరుచుకొని లోపలికి వెళ్లి తలుపు తట్టాడు. డోర్ తెరిచిన స్మితా సబర్వాల్ (Smita Sabharwal)కు అంత రాత్రి ఎదురుగా గుర్తు తెలియని కనిపించడంతో నివ్వెరపోయారు.

తేరుకున్న ఆమె.. ఎవరు నువ్వు..? ఎందుకొచ్చావు..? అని గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం.

గతంలో మీకు ట్వీట్ చేశానంటూ చెప్పిన డిప్యూటీ తహసీల్దార్.. తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని చెప్పినట్టు తెలిసింది.

దీంతో ఆగ్రహానికి గురైన ఆమె బయటికి వెళ్లాలని గట్టిగా కేకలు వేసినట్లు సమాచారం.

తన అనుమతి గుర్తు తెలియని వ్యక్తులకు లోపలకు ఎలా పంపారని ఆమె సెక్యూరిటీని ప్రశ్నించగా.. వారు అప్రమత్తమై అతడిని పట్టుకుని జుబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కారును సీజ్ చేసి, డిప్యూటీ తహసీ ల్దార్ పాటు అతడి స్నేహితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్టు తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version