Site icon Prime9

Bharat Jodo Yatra : తెలంగాణలోకి ఎంటరయిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర..

bharath Jodo Yatra in Hyderabad

bharath Jodo Yatra in Hyderabad

Bharat Jodo Yatra: కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర.. నేడు తెలంగాణలోకి ప్రవేశించింది. రాహుల్‌ గాంధీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో . కర్ణాటక సరిహద్దులో ఉన్న గూడబెల్లూరులో ఎంట్రీ ఇవ్వడంతో తెలంగాణలో జోడో యాత్ర ప్రారంభమయింది.

కర్ణాటక నుంచి తెలంగాణలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించిన సమయంలో.. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జాతీయ జెండాను తీసుకున్నారు. తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీకి.. మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఇతర పార్టీ నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బతుకమ్మ, బోనాలు, డోలు వాయిద్యాలతో రాహుల్‌కు తెలంగాణలోకి స్వాగతం చెప్పారు. అక్కడి నుంచి మూడు కి.మీల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర సాగించనున్నారు. తర్వాత పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. అనంతరం రాహుల్ గాంధీ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రాహుల్‌ పాదయాత్రను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్‌ను ఫైనల్ చేసిన లీడర్లు పాదయాత్రను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

తెలంగాణలో జోడో యాత్ర సుదీర్ఘంగా సాగనుంది. మొత్తం 16 రోజుల పాటు జరగనున్న ఈ పాదయాత్ర మొత్తం 19 అసెంబ్లీ నియోజవర్గాల గుండా సాగనుంది. అందులో 7 పార్లమెంట్ నియోజకవర్గాలను కూడా కవర్ చేయనున్నారు. మొత్తం 375 కిలోమీటర్ల మేర రాహుల్ నడవనున్నారు. వచ్చే నెల 7 వరకు జరగనున్న ఈ యాత్రకు దీపావళి సందర్భంగా మూడు రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నారు. అలాగే నవంబర్ 4న కూడా యాత్రకు ఒకరోజు బ్రేక్ పడనుంది. రోజూ 20 నుంచి 25 కిలోమీటర్ల మేర రాహుల్‌ నడవనున్నారు. రాహుల్‌తో పాటు పలు చోట్ల ఆయా ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు పాల్గొననున్నారు. అలాగే కార్నర్ మీటింగుల పేరుతో చాలాచోట్ల ప్రజలతో రాహుల్ ఇంటరాక్ట్ కానున్నారు. హైదరాబాద్‌లో కూడా ఒకరోజు ఉండనున్నారు. నెక్లెస్ రోడ్డులో మీటింగ్‌లో మాత్రం సోనియా, ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version