Hyderabad: భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ కేసిఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు పై పేర్కొన్న మాటలకు మంత్రి కేటిఆర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ మాట్లాడిన తీరు హస్యాస్పదంగా ఉందన్నారు. అంతర్జాతీయ నేత రాహుల్ కనీసం తన సొంత నియోజకవర్గం అమేఠీలో గెలవలేకపోయారు. అటువంటి వ్యక్తి కేసీఆర్ జాతీయ పార్టీ పై మట్లాడటం విడ్డూరం. ప్రధాని కావాలనుకునేవారు ముందు ఎంపీ అయ్యేలా ప్రజల్లో నమ్మకం సంపాదించుకోవాలి అని రాహుల్‌కు కేటిఆర్ చురకలంటించారు.
నిన్నటిదినం రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి పార్టీ అధినేతలు తమ పార్టీని గొప్పగా ఊహించుకొంటారని, తమకు తాము నేషనల్, గ్లోబల్ పార్టీలుగా చెప్పుకోవడంలో తప్పులేదని వ్యంగంగా మాట్లాడారు. దాంతో పాటు మునుగోడు ఉప ఎన్నికల్లో వందల కోట్లు భాజపా, తెరాస పార్టీలు ఖర్చు పెడుతున్నాయని ఆరోపించారు. దీనిపై మాత్రం మంత్రి కేటిఆర్ ఎలాంటి ప్రకటనలు గుప్పించకపోవడం గమానార్హం.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: తెరాసతో పొత్తు ఉండదు.. స్పష్టం చేసిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ