Site icon Prime9

Ponguleti Srinivas: ‘పార్టీ మార్పుపై నాలుగు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తా’

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas: మాజీ ఎంపీ , బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడం గురించి 3, 4 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని పొంగులేటి తెలిపారు. ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో శుక్రవారం ఆయన భేటీ అయ్యారు. పార్టీ మార్పుపై ఇక ఎక్కువ సమయం తీసుకోనని.. హైదరాబాద్ లో అధికారంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తానని తెలిపారు. అదే విధంగా ఖమ్మం బహిరంగ సభ తేదీలనూ కూడా త్వరలో వెల్లడిస్తానని పొంగులేటి చెప్పారు. ప్రజలు, అనుచరుల అభిప్రాయాలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. కార్యకర్తల సమక్షంలోనే కొత్త పార్టీ లో చేరతానని చెప్పారు.

కార్యకర్తల సమక్షంలోనే(Ponguleti Srinivas)

అన్ని ప్రాంతాల్లో ఉండే మేధావులు , కవులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యమ నాయకులతో చర్చలు జరిపినట్టు పొంగులేటి అన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటే కేసీఆర్, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తుందో విశ్లేషణ జరిపామన్నారు. సన్నిహితులు, అనుచరుల నుంచి అభిప్రాయాలుు సేకరించడానికి చాలా సమయం పట్టిందన్నారు.

కాగా శుక్రవారం ఖమ్మంలో పొంగులేటి తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పొంగులేటి తన భవిష్యత్ కార్యాచరణ, పార్టీ మార్పుకు సంబంధించిన స్పష్టత ఇవ్వనున్నారు. ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయనతో పాటు మాజీ మంత్రి జూపల్లి, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కలిసి వచ్చే నేతలు అందరూ ఒకేసారి కాంగ్రెస్‌ గూటికి చేరతారని సమాచారం.

 

Exit mobile version