Hyderabad: హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. ఉగ్రవాదుల కదలికలను ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా.. ఉగ్రదాడులకు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో మెుత్తం 16 మందిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. ఉగ్రవాదుల కదలికలను ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా.. ఉగ్రదాడులకు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో మెుత్తం 16 మందిని అరెస్ట్ చేశారు.
పక్కా సమాచారంతో మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 16మందిని యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన 11 మంది, హైదరాబాద్ కు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు.
కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో.. హైదరాబాద్ లో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పందగా ఉన్న మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, సాహిత్యం, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 18 నెలల నుంచి హైదరాబాద్ లో నిందితులు మకాం వేసినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సమాచారం. దీంతో అధికారులు అనుమానుతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.