Pawan Kalyan: వరంగల్ నిట్ లో నిర్వహించిన స్ప్రింగ్ ఫ్రీ – 2023 ప్రారంభోత్సవ వేడుకకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. దేశ భవిష్యత్ గురించి యువతకు పవన్ పలు సూచనలు చేశారు.
ఇక్కడి రావడం అదృష్టం.. (Pawan Kalyan)
వరంగల్ నిట్ లో నిర్వహించిన స్ప్రింగ్ ఫ్రీ – 2023 ప్రారంభోత్సవ వేడుకకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. దేశ భవిష్యత్ గురించి యువతకు పవన్ పలు సూచనలు చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ నిట్లో స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్
తెలంగాణలోని వరంగల్ నిట్లో నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే స్ప్రింగ్ స్ప్రీ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ వేడుకలో నిట్ కళాశాలతో పాటు ఇతర కళాశాలకు చెందిన సుమారు 8వేల మంది విద్యార్ధులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో విద్యార్థుల ఆటపాటలు, కేరింతలు అలరించాయి.
యువతకు పవన్ సూచనలు
విద్యార్ధులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పెద్దగా చదువుకోలేదని.. కానీ సమాజాన్ని చదువుకున్నానని పవన్ అన్నారు.
విద్యార్ధులు కష్టపడి భవిష్యత్తులో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావలని సూచించారు. జీవితంలో పరాజయాలను ఎదుర్కొంటేనే.. విజయం సాధించగలమని అన్నారు.
మనిషి జీవితంలో ప్రతి విషయాన్ని నేర్చుకోవాలని.. అపజయాలనే విజయ సోపానాలుగా మార్చుకోవాలని యువతకు తెలిపారు.
దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే.. నెహ్రూ ముందుచూపుతో ఎన్ఐటీలను ప్రారంభించారని తెలిపారు. తాను సాధారణంగా విద్యాసంస్థల కార్యక్రమాలకు దూరంగా ఉంటానని.. జనసేన అధినేత అన్నారు.
ఈ సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను విద్యార్ధులతో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ తన బాల్యంలో లియోనార్డో డావిన్సీ ని రోల్ మోడల్ గా పేర్కొన్నారు.
తాను ఇంటర్ లో ఫెయిల్ అయ్యాయని.. తన స్నేహితులు చిట్టీలు పెట్టుకొని పాసయ్యారని తెలిపాడు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యా. కానీ, నైతికంగా నేను విజయం సాధించా.
మీ సామర్థ్యాలకు తగిన ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను. కళ.. ఏ రాష్ట్రానికి చెందినవారినైనా కలుపుతుంది. మానవత్వం, సంస్కృతి ఒక్కటే మనుషులను ఏకం చేస్తుందని తెలిపారు.
ఈ వేడుక మూడు రోజుల పాటు జరగనుంది.