Central Railway: ప్రయాణీకుల రద్ధీతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణించేందుకు రిజర్వేషన్ టిక్కెట్లు దొరకడమే నానా కష్టంగా మారింది. ఈ క్రమంలో భాగ్యనగర ప్రజలకు దక్షిణ రైల్వే తీపి కబురు చెప్పింది. ఈ నెల 12 నుండి 16 వరకు 6 ప్రత్యేక రైళ్లు హైదరాబాదు మీదుగా వెళ్లనున్నట్లు ప్రకటించింది.
12న సికింద్రాబాద్- తిరుపతి (07411), బెంగళూరు- జోధ్‌పూర్ (06589), 13న తిరుపతి-సికింద్రాబాద్ (07412), 14న హైదరాబాద్-గోరక్‌పూర్ (02575), 15న బెంగళూరు కంటోన్మెంట్-విశాఖపట్నం (06587), 16న గోరక్‌పూర్- హైదరాబాద్ (02576)కు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
మరో వైపు గుంటూరు డివిజన్ లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నెల 12 నుండి 20 వరకు నాలుగు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. 12 నుంచి 19 వరకు గుంటూరు-డోన్ రైలు (17228), అక్టోబర్ 13 నుంచి 20 వరకు డోన్ -గుంటూరు రైలు (17227), అక్టోబర్ 17, 18 తేదీల్లో గుంటూరు-కాచిగూడ రైలు (17251), 17, 18 తేదీల్లో కాచిగూడ- గుంటూరు రైలు (17252)ను రద్దు చేసినట్టు తెలిపారు. ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలన్ని చూసుకోవాలని విజ్నప్తి చేశారు.
ఇది కూడా చదవండి: విద్యార్ధులకు బస్సు సౌకర్యం కల్పించండి.. తెలంగాణ సర్కారుకు పవన్ లేఖ