Paper Leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులతో బేరం కుదుర్చుకున్న ఓ జంట చేసిన పాపం పండింది. దొరక్కుండా ఉండటానికి వారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలు తిరిగారు. కానీ సిట్ విచారణలో వారి పేర్లు బయటకి రావడంతో.. వారిని అదుపులోకి తీసుకున్నారు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులతో బేరం కుదుర్చుకున్న ఓ జంట చేసిన పాపం పండింది. దొరక్కుండా ఉండటానికి వారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలు తిరిగారు. కానీ సిట్ విచారణలో వారి పేర్లు బయటకి రావడంతో.. వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ జంట.. పేపర్ లీకేజీలో దొరికిపోయారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ లో చేసిన తప్పుల సవరణకు టీఎస్ పీఎస్సీ కార్యాలయానికి వెల్లింది. అయితే అక్కడ డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష పేపర్ దక్కింది. దీనికి బేరం కుదుర్చుకున్నారు. ఇక జాబ్ గ్యారంటీ అనుకున్న సమయంలో కథ అడ్డం తిరిగింది. జాబ్ కచ్చితంగా వస్తుందనే సంతోషంలో ఉన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం బయటకి రావడం.. ఒక్కొక్కరు అరెస్ట్ అవ్వడం వారిలో కలవరం పెంచింది. చేసిన పాపం పోవాలని.. 25 రోజులుగా పుణ్యక్షేత్రాల చుట్టూ తిరిగారు. కానీ చివరకు నేరం బట్టబయలైంది. ఇటివలే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఖమ్మంకు చెందిన సుస్మిత వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. పోటీ పరీక్షలకు సిద్దం కావాడానికి సాఫ్ట్ వేర్ జాబ్ ని వదిలేసింది.
అయితే గ్రూప్–1 ప్రిలిమ్స్ రాసినప్పటికీ ఓఎంఆర్ షీట్‌లో రాంగ్ బబ్లింగ్ చేసింది. దీనిని సరిచేసుకోవడానికి కార్యాలయానికి వెళ్లింది.
ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. దీంతో లౌకిక్ రూ. 6 లక్షలు చెల్లించి డీఏఓ పరీక్ష పేపర్ ను కొనుగులు చేసి భార్యకు అందించాడు.
దీని ఆధారంగా సుస్మిత పరీక్ష రాసింది. తెలిసిన ప్రశ్నలే రావడంతో.. కచ్చితంగా ఉద్యోగం వస్తుందని భావించింది.
కానీ పేపర్ లీకేజీ వెలుగులోకి రావడంతో.. నిందితులను పోలీసులు ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు.
డీఏఓ పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రాకూడదని, తాము ఈ కేసులో ఇరుక్కోకూడదని ప్రార్థనలు మొదలెట్టారు.
నిద్రలేని రాత్రులు గడిపిన ఈ జంట.. ఆ ఒత్తిడిని జయించడానికి తిరుపతి, షిర్డీ సహా అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్లింది.
అయితే ప్రవీణ్‌కు రూ. 6 లక్షల సొమ్మును లౌకిక్ ఆన్‌లైన్‌లో బదిలీ చేయడంతో ఈ క్లూ ఆధారంగా ‘సిట్’పోలీసులు వారిని ఈ నెల 7న అరెస్టు చేశారు.