Nizamabad: వరంగల్ కాకతీయ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యాయత్నం మరువక ముందే.. నిజామాబాద్ లో మరో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలానికి చెందిన హర్హ బలవన్మరణం పాలయ్యాడు.
తెల్లవారేసరికి విగతజీవిగా( Nizamabad)
అర్ధరాత్రి 2 గంటల వరకు తోటి వారితో కలిసున్న హర్ష.. తెల్లవారే సరికి హాస్టల్ గదిలో శవమై కనిపించాడు. నిజామాబాద్ మెడికల్ కాలేజ్ లో హర్ష ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
హర్ష ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు విద్యార్థి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హర్ష చదవులో ముందు ఉండేవాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వాళ్లు చెబుతున్నారు.
ప్రాణాలతో పోరాటం చేస్తున్న ప్రీతి
మరోవైపు వరంగల్ కాకతీయ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఇంకా ప్రాణాల కోసం పోరాడుతూనే ఉంది. ఆమె హెల్త్ బులిటెన్‌ను నిమ్స్ హాస్పిటల్ వైద్యులు విడుదల చేశారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా నే ఉందని వైద్యులు తెలిపారు.
ప్రీతికి నాలుగు రోజులుగా చికిత్స జరుగుతోంది. ఇంకా ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు. ప్రీతిని కాపాడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నామన్నారు.
ఈ మేరకు డీఎంహెచ్‌వోకు వైద్యుల బృందం నివేదికను అందజేసింది. ప్రీతి ఆత్మహత్యాయత్నంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కేసు నమోదు చేసింది.
కాగా, ప్రీతిని రక్షించేందుకు నిమ్స్ డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకోవడంతో.. దాని ప్రభావం శరీరంలోని భాగాలపై విపరీతంగా ఉందని చెబుతున్నారు.
ముఖ్యంగా బ్రెయిన్ పై మత్తు ఇంజెక్షెన్ ప్రభావం ఎక్కువగా పడిందని .. ఈ నేపథ్యంలో ప్రీతికి మెరుగైన వైద్యం కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్న
సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిందిని డాక్టర్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
వెంటనే సీపీఆర్ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారు డాక్టర్లు. నిమ్స్‌కు చేరుకున్న అనంతరం ప్రీతికి పూర్తిగా వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స కొనసాగుతోంది.