Site icon Prime9

Nirmala Sitharaman: హరీష్‌ రావు వెటకారంగా మాట్లాడటం సరికాదు.. నిర్మలాసీతారామన్

Nirmala-Sitharaman-Counter-To-Harish-Rao

Hyderabad: మంత్రి హరీష్‌ రావు వ్యంగంగా, వెటకారంగా మాట్లాడటం సరికాదు. మంత్రులు అవతలి వారు ఏం మాట్లాడారో జాగ్రత్తగా విని స్పందించాలి అని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ సూచించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వాటా ఉన్న పథకాలకు కేంద్రం పేరు పెట్టాల్సిందేనని స్పష్టం చేసారు. రాష్ట్రం వాటా ఇచ్చిన మరుక్షణమే కేంద్రం వాటా విడుదల చేస్తున్నాము. 2021 వరకు తెలంగాణ ఆయుష్మాన్‌ భారత్‌లో ఎందుకు చేరలేదు అని ఆమె ప్రశ్నించారు.

కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్రం ఇవ్వకపోవడంతో ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉంటున్నాయి. రాష్ట్ర మంత్రులు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలి. 60 శాతం నిధులు కేంద్రం ఇస్తే, 40 శాతం రాష్ట్రాలు భరించాలి. హైదరాబాద్‌ నుంచే తెలంగాణకు 55 శాతం ఆదాయం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లాభసాటి కాదని నిపుణులే అంటున్నారు. అప్పులు తీసుకొచ్చి చేసే పనులు ఆలస్యం అయితే కేంద్రానిది బాధ్యత కాదని అన్నారు.

అంతకుముందు కామా రెడ్డి, నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి సీతారామన్ పలు గణేష్ మండపాలు సందర్శించి పూజలు నిర్వహించారు. మల్లన్నసాగర్, మిడ్ మానేరు, సీతారామ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటిదాకా పూర్తి పరిహారం ఇవ్వలేదని విమర్శించారు.

Exit mobile version