Site icon Prime9

National Herald Case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. 8 మంది తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు

ED T.CONGRESS

ED T.CONGRESS

Hyderabad: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో 8 మంది తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. షబ్బీర్‌ అలీ , సుదర్శన్‌రెడ్డి అంజన్‌కుమార్‌ యాదవ్‌, రేణుకాచౌదరి, గీతారెడ్డి సహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్‌ 10న ఢిల్లీ లో ఈడీ విచారణకు హాజరు కావాలని తెలిపింది. అయితే తమకు ఇంకా నోటీసులు అందలేదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ తదితరులను ఈడీ విచారించింది. ఈడీకి సహాయం చేసిన నేతల్లో అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి పేర్లు ఉన్నాయి. అయితే తమకు ఎటువంటి నోటీసులు అందలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి తమకు నోటీసులు అందలేదని స్పష్టం చేసారు. పార్టీ విరాళం కింద డబ్బులు ఇచ్చింది వాస్తవమేనని పేర్కొన్నారు. తాము చెక్కుల రూపంలో ఇచ్చామని, నోటీసులు వస్తే ఈడీ విచారణకు హాజరవుతామని వెల్లడించారు. తామేమీ నేరం చేయలేదని ఈడీకి భయపడటం ఎందుకని ప్రశ్నించారు.

సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటీషన్ ఆధారంగా కోర్టు ఆదేశాలతో ఈడీ ఈ కేసును విచారిస్తోంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఈడీ విచారించేందుకు సిద్దమైందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version