Site icon Prime9

Balka Suman: దేశం కొత్త శక్తి కోసం ఎదురు చూస్తోంది.. బాల్క సుమన్

balka-suman

Hyderabad: తెలంగాణాలో ఎన్నికల సమయంలో దగ్గర పడేకొద్ది టిఆర్ఎస్ నేతల్లో జోరు ఊపందుకొంటుంది. కేంద్రం పై పెద్ద పోరాటం చేస్తూ, తెలంగాణ వాదాన్ని వినిపించేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. మరో వైపు దేశ రాజకీయాలే మాకు ప్రధాన టార్గెట్ అంటూ ఊపదంపుడు మాటలను పదే పదే ఉచ్చరిస్తున్నారు.

తాజాగా టిఆర్ఎస్ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ దేశం కొత్త శక్తి కోసం ఎదురుచూస్తోంది. అందుకు కేసిఆర్ దేశ రాజకీయాల్లో రావాల్సిన సమయం ఆసన్నం అయిందని పిలుపు నిచ్చారు. తెలంగాణ భవన్ లో చేపట్టిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బిజెపి ముక్త భారత్ దిశగా టిఆర్ఎస్ అడుగులు వేస్తుందన్నారు. సిఎం దేశ రాజకీయాల వైపు దృష్టి సారించాలని విజ్నప్తి చేశారు. దేశంలో రాక్షస పాలన అంతం కావాలంటే కేసిఆర్ ఒక్కరే మార్గమని సూచించారు. మోదీ ప్రభుత్వం 8 సంవత్సరాలుగా దేశాన్ని అతాకుతలం చేసిందని, దుర్మార్గ పాలన, వ్యవస్ధలను నాశనం చేసేందులో మాత్రమే మోదీ ముందున్నారని దుయ్యబట్టారు. కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్లు మాఫీ పేరుతో దోచిపెట్టారని సుమన్ ఆరోపించారు. సమావేశంలో మరో నేత జీవన్ రెడ్డి కూడా మోదీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టారు.

టిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నప్పటికీ జాతీయ స్ధాయిలో కేసిఆర్ పై విపక్ష నేతలు పెద్గగా స్పందించడం లేదని సమాచారం. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఆయన పలు కీలక ఆరోపణలు ప్రజాప్రతినిధులపై చేశారు. ఈ క్రమంలో కేసిఆర్ ను సమర్ధిస్తే, ప్రజలు ఏమేరకు తమ వైపు ఉంటారు అన్న సందేహాలు కూడా విపక్ష నేతలకు ఉండడంతోనే కేసిఆర్ జాతీయ స్థాయి ప్లాన్ మాటలకే సరిపోతుందని చెప్పవచ్చు.

Exit mobile version