MP Dharmapuri Arvind: మంత్రి కేటీఆర్ త్వరలోనే జైలుకు వెడతారు.. ఎంపీ ధర్మపురి అరవింద్

మంత్రి కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లే పరిస్దితి వస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్యపురి అరవింద్ అన్నారు. ఈ నెల 5న సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన పై ఆయన విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ కు ఏమిచేసారని కేసీఆర్ ఇక్కడ పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు.

  • Written By:
  • Publish Date - September 3, 2022 / 04:30 PM IST

Nizamabad: మంత్రి కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లే పరిస్దితి వస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్యపురి అరవింద్ అన్నారు. ఈ నెల 5న సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన పై ఆయన విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ కు ఏమి చేసారని కేసీఆర్ ఇక్కడ పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు.

నిజామాబాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, బీడీ భవన్, రైతు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఉచిత ఎరువులు, ఎకరంపల్లి ఎయిర్ పోర్టు, పోడు భూములు, కేజీ టు పీజీ విద్య, తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు, నిరుద్యోగ భృతి, ప్రతి మండలానికి నలుగు డాక్టర్లతో పాటు 30 పడకల ఆసుపత్రి, మాధవినగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, లీటర్ పాలకు నాలుగు రూపాయల ఇన్సెంటివ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు కేసీఆర్ ఇచ్చారని, కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అరవింద్ విమర్శించారు.

పేదలకు ఇచ్చే బియ్యం పంపిణీ విషయంలో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కలెక్టర్ ను ప్రశ్నిస్తే ప్రశాంత్ రెడ్డి విమర్శలు గుప్పించడం సరికాదన్నారు. బియ్యానికి కేంద్రం రూ. 30 ఇవ్వడం లేదా ? అని ప్రశ్నించారు.