Site icon Prime9

Modi No Entry Flexi: తెలంగాణలో ‘మోదీ నో ఎంట్రీ’ ఫ్లెక్సీల కలకలం

flexIes

flexIes

Hyderabad: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్, కరీంనగర్, రామగుండంలో ‘మోదీ నో ఎంట్రీ’ అంటూ వెలిసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేనేత వస్తువుల పై విధించిన 5 జీఎస్టిని రద్దు చేసాకే తెలంగాణ గడ్డ పై అడుగుపెట్టాలంటూ చేనేత యూత్ ఫోర్స్ పేరిట ఫ్లెక్సీలు వెలిసాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ ఫోస్ట్ వద్ద ఇలా నో ఎంట్రీ మోదీ ప్లెక్సీలు కనిపిస్తున్నారు.

గతంలో చేనేత ఉత్పత్తులు, ముడిసరుకుల పై విధించిన ఐదు శాతం జీఎస్టీని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ చేనేత కార్మికులు చేతులతో రాసిన లక్షలాది పోస్టుకార్డులను ప్రధానికి పంపారు. అక్టోబర్ 22న ప్రచారాన్ని ప్రారంభించిన అనంతరం చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పోస్ట్‌కార్డులు పంపించారు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్) ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేందుకు ప్రధాని మోదీ శనివారం రామగుండం సందర్శించనున్నారు.

తెలంగాణా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని మరియు అతను తెలంగాణలోకి ప్రవేశించే ముందు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ “మోడీ గో బ్యాక్” నిరసనలు ఊపందుకుంటున్నాయి. మరోవైపు ఇది ఇది ముమ్మాటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ పనేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar