Munugode By Poll: దేశంలో చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధానిగా మోదీ అని మంత్రి కేటిఆర్ మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా కార్మికులతో పేర్కొన్నారు.
చేనేతలకు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది కూడా భాజపానేని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పొదుపు, భీమా పధకాల రద్దు ఘనత కూడా మోదీదే అని దుయ్యబట్టారు. ఓటుతో మునుగోడు ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలని వారిని కోరారు. నేతన్నల ఆదుకొన్నది తెరాసగా పేర్కొన్న కేటిఆర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ నిధులు ఇచ్చామన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలని చేనేత కార్మికులను ఆయన కోరారు.
ఇది కూడా చదవండి: Munugode By poll: లెక్క ఖరారైంది… మునుగోడు ఉప పోరులో 47మంది అభ్యర్ధులు