Temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు ప్రజలను అతలకుతలం చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో అడుగు బయటపెట్టాలంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే నిప్పుల కొలిమిని తెలుగు రాష్ట్రాలు తలపిస్తున్నాయి. అయితే మరో మూడు రోజులు.. మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణకేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరో మూడు రోజులు..
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు ప్రజలను అతలకుతలం చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో అడుగు బయటపెట్టాలంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే నిప్పుల కొలిమిని తెలుగు రాష్ట్రాలు తలపిస్తున్నాయి. అయితే మరో మూడు రోజులు.. మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణకేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని ప్రాంతాల్లో పగటిపూట కాకుండా.. రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయవ్య భారత్ నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే పరిస్థితి మరో మూడు రోజులు ఉండనున్నట్లు పేర్కొంది.
ఇప్పటి వరకు తెలంగాణలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 41 డిగ్రీల దాకా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అవసరమైతేనే బయటకి రావాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరంగల్ 43, నల్లగొండ, ఖమ్మం 44, భూపాలపల్లిలో 45 డిగ్రీలు, నల్గొండ నిడమనూరులో 45 డిగ్రీలు, ములుగు తాడ్వాయి 44.5 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లు నమోదు అయ్యాయి.
ఇక ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రకాశం 46, ఏలూరు, విజయవాడలో 47, గుంటూరులలో 48 డిగ్రీలు, రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీల టెంపరేచర్లు నమోదు అయినట్లు తెలుస్తోంది.
వడదెబ్బతో తెలంగాణలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు.