Hanamkonda: హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో జరిగే సభకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది. పోలీసుల తీరును సవాల్ చేస్తూ బీజేపీ శ్రేణులు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. రేపు ఆర్ట్స్ కళాశాలలో బీజేపీ సభ జరగాల్సి ఉంది. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో కళాశాల ప్రిన్సిపాల్ ఐలయ్య సభను రద్దు చేస్తున్నట్లు బీజేపీ నేతలకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. మరికాసేపట్లో లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు తీర్పుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
Telangana BJP: హన్మకొండలో బీజేపీ సభ కోసం హైకోర్టులో పిటిషన్
