Site icon Prime9

Liquor Scam: ఢిల్లీ బయలుదేరిన కల్వకుంట్ల కవిత.. రేపు ఏం జరగబోతోంది?

Liquor Scam

Liquor Scam

Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ బయల్దేరారు. అయితే ఇప్పటికే షెడ్యూల్‌ కార్యక్రమాలు ఉన్నందున.. ఆమె గురువారం ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనే విషయం తీవ్ర ఉత్కంఠగా మారింది.

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మార్చి 10 న మహిళా బిల్లు ఆమోదం కోసం జాగృతి సంఘాలతో కలిసి కవిత దీక్ష చేయనున్నారు.

భారత జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి దేశ నలమూలల నుంచి విధ పార్టీల నేతలు, మహిళా సంఘాలను ఆహ్వానించారు.

దానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం గురువారం, శుక్రవారం ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని బుధవారం ఉదయమే కవిత ఈడీకి తెలియచేసినట్టు సమాచారం.

కవిత హాజరయ్యే అవకాశం లేదు: పార్టీ వర్గాలు(Liquor Scam)

ఈ నేపథ్యంలో ఈడీని కూడా గడువు కోరినట్టు తెలుస్తోంది. అయితే బుధవారం సాయంత్రం కవిత ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. గురువారం ఉదయం విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.

ఈడీ విచారణకు అన్నీ విధాలా సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నప్పటికీ, ముందస్తు కార్యక్రమాల వల్ల.. ఏం చేయాలనే దానిపై బీఆర్ఎస్ నేతలతో పాటు,

న్యాయవాదులతో కవిత చర్చించారు. చర్చల అనంతరం కవిత ఢిల్లీ బయలుదేరారు.

అయితే, గురువారం ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

అనుకున్నట్టుగానే శుక్రవారం కచ్చితంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తారని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ధర్నా ఏర్పాట్ల కోసమే కవిత ఢిల్లీ వెళ్లినట్టు చెబుతున్నారు.

 

తీవ్ర ఉత్కంఠ

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో సౌత్‌ గ్రూప్‌కు సంబంధించి ఎమ్మెల్సీ కవిత కీలకపాత్ర పోషించారని, ఆమె తరఫున అరుణ్‌ రామచంద్ర పిళ్లై బినామీగా వ్యవహరించినట్టు ఈడీ రిమాండ్‌ రిపోర్టులో ఇప్పటికే ప్రస్తావించింది.

ఈ క్రమంలోనే ఇప్పటికే అరుణ్ పిళ్లైని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. మరో వారం రోజుల పాటు పిళ్లై కస్టడీ కొనసాగుతుంది.

అనంతరం కవితకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నోటీసుల నేపథ్యంలో గురువారం ఢిల్లీలో ఏం జరగనుందో చూడాలి.

 

Exit mobile version