Site icon Prime9

MLA Jagga reddy: వచ్చే ఎన్నిల్లో రూ.100 కోట్ల ఖర్చు పెట్టయినా అధికారంలోకి వద్దాం.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

mla-jaggareddy

mla-jaggareddy

Sangareddy: తెలంగాణలో వచ్చే ఎన్నిల్లో రూ.100 కోట్ల ఖర్చు పెట్టి అయినా సరే టీఆర్ఎస్, బీజేపీని ఓడించి అధికారంలోకి వద్దామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌తో దాడోపేడో తేల్చుకుందామని, బీజేపీని అణగదొక్కుకుంటూ ముందుకు సాగుతామంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చి తీరుతుందని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాకపోవడం పై జగ్గారెడ్డి స్పందించారు. మునుగోడులో గెలవకపోవడం పై కాంగ్రెస్ శ్రేణులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాన్ని చూపిద్దామంటూ శ్రేణులకు సూచించారు. కేసీఆర్‌కు భయపడి పోలీసులు డ్యూటీ చేయవద్దని, కాంగ్రెస్ శ్రేణుల పై తప్పుడు కేసులు పెట్టవద్దని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు నేతలు అండగా ఉండాలని జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ కార్యక్తలను పోలీసులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారికి తెలంగాణ కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.

మేము రూ.100 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే మునుగోడులో ఫస్ట్ ప్లేస్, రూ.50 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే రెండో స్థానం దక్కించుకునేవాళ్లం. డబ్బులు ఖర్చు పెట్టలేదు కాబట్టే మునుగోడులో మూడో స్థానం దక్కించుకున్నాం. ఉపఎన్నికలో ఓడిపోయినందుకు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేము కూడా పైసలు ఖర్చు పెడతాం. మా పార్టీలో కూడా బలమైన నాయకులు ఉన్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే డబ్బులు సమకూర్చుకుంటాం. వచ్చే ఎన్నికల్లో మా సత్తాను ధనబలం రూపంలో కూడా చూపిస్తాం. టీఆర్ఎస్, బీజేపీ వాళ్లు ఎంత ఖర్చు పెడతారో మేము కూడా అంతే ఖర్చు పెడతామంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version
Skip to toolbar