TS Assembly: ఎనిమిది బిల్లులకు తెలంగాణ శాసన సభ ఆమోదం

తెలంగాణ ప్రభుత్వం నేడు శాసన సభలో ఎనిమిది బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది.

  • Written By:
  • Publish Date - September 13, 2022 / 05:15 PM IST

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం నేడు శాసన సభలో ఎనిమిది బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది. మోటార్ వెహికల్‌ పన్నుల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, అజమాబాద్‌ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సూపరెన్యుయేషన్ సవరణ బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టగా, శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

మోటార్ వెహికల్‌ పన్నుల చట్ట సవరణ బిల్లు పై చర్చ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌ మాట్లాడుతూ వాహనాల విక్రయంలో ప్రభుత్వానికి పన్నులు సరిగా వస్తాయన్నారు. పన్నులు ఎగ్గొట్టకుండా ఉండేందుకే సవరణ బిల్లు అని తెలిపారు. డీలర్ల రాయితీ నిలువరించేందుకే పన్నుల చట్ట సవరణ బిల్లు అని, లారీల అంతర్రాష్ట్ర పన్నుల పై ఏపీ అధికారులతో మాట్లాడుతున్నామని తెలిపారు.

కొత్త ప్రైవేట్ వర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.