Site icon Prime9

Mlc Kavitha Cbi Enquiry : లిక్కర్ స్కామ్ లో నేడు విచారణకు హాజరైన కవిత.. చెల్లి కోసం డిల్లీలో కేటీఆర్..

latest update about mlc kavitha cbi enquiry about liquor scam

latest update about mlc kavitha cbi enquiry about liquor scam

Mlc Kavitha Cbi Enquiry : డిల్లీ లిక్కర్ స్కామ్ విషయం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుండగా ఇప్పటివరకు 11 మందిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ అరుణ్ రామచంద్ర పిళ్ళై ని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  ఈ స్కామ్‌లో కవితకు సంబంధించిన కీలక వివరాలు పిళ్లై వెల్లడించాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ (శనివారం) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. కాగా కొద్ది సేపటి క్రితమే కవిత ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. నిరసనలు జరుగొచ్చన్న నేపథ్యంలో ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ కార్యాలయం వద్ద మీడియాకు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే ఈడీ కార్యాలయంలోనే మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై ఉన్నారు. రూ.100 కోట్ల ముడుపుల్లో కవిత పాత్రపై ఈడీ ప్రశ్నించనుంది. మనీశ్ సిసోడియా కస్టడీ పిటిషన్ లో కవిత పేరును ప్రస్తావించిన ఈడీ మనీలాండరింగ్ చట్టం సెక్షన్ 50, 54 కింద ప్రశ్నించనుంది. మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై, కవితను కలిపి ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కవిత కోసం డిల్లీలో కేటీఆర్ (Mlc Kavitha Cbi Enquiry)..

ఇక కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని కేసీఆర్‌ అన్నారు. ‘‘రేపు విచారణ పేరుతో కవితను అరెస్ట్‌ చేసి ఇబ్బంది పెట్టొచ్చు. చేసుకుంటే చేసుకోనీ అందర్నీ వేధిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. న్యాయపోరాటం చేద్దాం, రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం అంటూ పార్టీ నాయకులతో కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అదే విధంగా నిన్న పార్టీ విస్తృత స్థాయి మీటింగ్ ముగియగానే కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు డిల్లీలో కవిత ఉంటున్న కేసీఆర్ నివాసంలో లీగల్ టీం తో కలిసి కేటీఆర్ సమావేశం అయ్యారు.

ఒకవైపు ఈడీ విచారణకు కవిత సిద్ధమవుతుంటే మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత విచారణకు ముందు ఈడీకి ఇచ్చిన తన స్టేట్ మెంట్ ను ఉపసంహరించుకుంటూ అరుణ్ పిళ్లై ప్లేట్ పిరాయించారు. సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించిన పిళ్లై.. కవిత తరపున వ్యాపారం చేశారని, ఆయన కవితకు సహాయకుడిగా పని చేశారని ఈడీ ఆరోపిస్తోంది. అరుణ్ పిళ్లైని 29 సార్లు ప్రశ్నించిన ఈడీ 11 సార్లు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. కవిత విచారణకు ప్రధానంగా అరుణ్ పిళ్లై వాంగ్మూలమే ఆధారంగా భావించి ఈడీ ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఇలాంటి సమయంలో ఈడీకి అరుణ్ పిళ్లై ట్విస్టు ఇచ్చారు. తాను ఈడీకి ఇచ్చిన అన్ని వాంగ్మూలాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో అరుణ్ పిళ్లై పిటిషన్ దాఖలు చేశారు. చూడాలి మరి ఈరోజు కవిత విచారణ తర్వాత ఏం జరుగుతుందో అని..

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version