Site icon Prime9

MLC Kavitha Vs MP Aravind : ఎంపీ ధర్మపురి అరవింద్ వర్సెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ముదిరిన మాటల యుద్దం

latest political news about MLC Kavitha Vs MP Aravind heated arguement

latest political news about MLC Kavitha Vs MP Aravind heated arguement

MLC Kavitha Vs MP Aravind : తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులు మాటల యుద్దానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ఓ అంశం పట్ల బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య మాటల యుద్దం జరుగుతుంది. తెలంగాణలో రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు బీమా ఇస్తామంటూ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొనడం పట్ల అరవింద్ వ్యంగ్యంగా స్పందించారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. కేసీఆర్ చనిపోతే రూ.5 లక్షలు, కేటీఆర్ చనిపోతే రూ.10 లక్షలు, కవిత చనిపోతే రూ.20 లక్షలు ఇస్తామని వ్యాఖ్యానించారు.

ఎంపీ అరవింద్ వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఇదేం సంస్కారం అరవింద్! మీలాంటి బూజు పట్టిన వ్యక్తులను మార్చాల్సిన టైమ్ వచ్చేసింది’’ అని అన్నారు. తాను జగిత్యాలలో ఆడబిడ్డలతో కలసి బతుకమ్మ పండుగ చేసుకోవడానికి వచ్చానని… ఈ సందర్భంగా తన గురించి అర్వింద్ అసభ్యకరంగా, అభ్యంతరకంగా వ్యాఖ్యలు చేశారని వారు తనతో చెప్పారని అన్నారు. తాను (MLC Kavitha Vs MP Aravind) నిజమాబాద్ లో ఓడిపోయిన తర్వాత కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నానని… కానీ, గెలిచిన అర్వింద్ మాత్రం ఎంపీగా బాధ్యతలను విస్మరించి, తనపై అనేక రకాలుగా మాట్లాడారని విమర్శించారు.

తాను కేసీఆర్ బిడ్డను కాబట్టి, ఏది పడితే అది మాట్లాడటం కరెక్టేనా అని ప్రశ్నించారు. సమస్యలపై మాట్లాడకుండా, వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని… ఇలాంటి మాటలే తాము మీ ఇంట్లో ఆడవారిపై మాట్లాడితే మీరు భరించగలరా? అని ప్రశ్నించారు. ఆంధ్ర పాలకులు కూడా ఎప్పుడూ ఇంత దారుణంగా మాట్లాడలేదని చెప్పారు.

మీకేమైనా కళ్లు బైర్లు కమ్మాయా – ఎంపీ అరవింద్ (MLC Kavitha Vs MP Aravind).. 

అయితే వాటికి కొనసాగింపుగా అరవింద్ మళ్ళీ స్పందించారు. “సీఎం కేసీఆర్ కూతురు అయిన మన ఎమ్మెల్సీ ఎన్నడూ ఏ పాపం చేయలే.. రూపాయి కూడా తినలేదు. తెలంగాణను ముంచలేదు” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చచ్చిపోతే రూ.10 లక్షలు ఇస్తారా..? మీకేమైనా కళ్లు బైర్లు కమ్మాయా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఎవరైనా చనిపోతే రూ.5 లక్షలు ఇస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టడం ఏంటని నిలదీశారు. తెలంగాణలో కరోనా మహమ్మారి బారిన పడి ఆసుపత్రి పాలై, బాధితులు లక్షలాది రూపాయలు కడుతున్నా.. ఆరోగ్య శ్రీ ఇచ్చారా? కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ ఇచ్చారా? పంటలు నష్టపోతుంటే పరిహారం చెల్లించారా? అని అరవింద్ ప్రశ్నించారు. ఇవన్నీ చేయకుండా రైతు చనిపోతే రూ.5 లక్షలు ఇస్తామనడం ఏంటని నిలదీశారు.

 

Exit mobile version