Site icon Prime9

Crime News : శంషాబాద్‌లో దారుణం.. దిశ తరహా ఘటన రిపీట్

latest crime news about married woman murder at shamshabad

latest crime news about married woman murder at shamshabad

Crime News : హైదరాబాద్ నగర పరిధిలోని శంషాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గతంలో యావత్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ తరహాలోనే ఈ ఘటన జరగం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల స్థలాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు మహిళను దారుణంగా హత్య చేసి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మృతదేహం స్థానికులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.

కాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలి వయస్సు 35 – 36 ఏళ్ల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. అలానే కాళ్లకు మెట్టెలు ఉండటంతో వివాహితగా గుర్తించారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఆ మహిళ ఎవరు? ముందుగానే చంపేసి అక్కడకు తీసుకొచ్చి తగులబెట్టారా? లేక ఇక్కడికి తీసుకొచ్చాకా అత్యాచారం చేసి చంపేసిన తర్వాత తగాలబెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ కేసు విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం అందుతుంది.

Exit mobile version