Site icon Prime9

Minister KTR: ఆయన కలపడానికి వస్తే, మీరు విడదీయానికి వచ్చారు.. అమిత్ షా పై కేటీఆర్ సెటైర్లు

ktr-satairs-on-amit-shah

Hyderabad: టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై సెటైర్లు వేసారు. 74 ఏండ్ల క్రితం నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఇండియ‌న్ యూనియ‌న్‌లో క‌లిపేందుకు వ‌చ్చారు. కానీ ఇవాళ‌నేమో ప్ర‌స్తుత కేంద్ర హోం మంత్రి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని విభ‌జ‌న చేసేందుకు హైద‌రాబాద్‌కు వ‌చ్చార‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. దేశానికి కావాల్సింది విభ‌జ‌న రాజ‌కీయాలు కాదు. నిర్ణ‌యాత్మ‌క రాజ‌కీయాలు కావాల‌ని తాను ప‌దే ప‌దే చెప్తున్నాన‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడ ట్విట్టర్ వేదికగా అమిత్ షాను నిలదీసారు. స్వతంత్ర ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? హైదరాబాద్ సమైక్యత ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమం లో మీ పాత్ర ఏంటి? అని క‌విత ప్ర‌శ్నించారు. హైదరాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న అమిత్ షాతో బీజేపీ నేత‌లు ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని క‌విత డిమాండ్ చేశారు.

Exit mobile version