Site icon Prime9

KTR Road Show: కేటిఆర్ రోడ్ షో.. వాహనదారులకు ఇక్కట్లు

KTR road show...difficulties for motorists

KTR road show...difficulties for motorists

Hyderabad: ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటిఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాదు నుండి విజయవాడ వెళ్లే వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు ఘట్కేసర్, భువనగిరి మీదుగా వెళ్లాలని, విజయవాడ నుంచి హైదరాబాదుకు వెళ్లే వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు చిట్యాల, భువనగిరి, ఘట్కేసర్ మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్‌షోకు 4 గంటల ముందు ఆంక్షలు విధించడం పై వాహనదారులు మండిపడుతున్నారు.

వాస్తవానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పర్యటనల సమయంలో ఇలాంటి ఆంక్షలు విధిస్తారు. అందులోనూ దీపావళి సెలవులతో పాటు శుక్రవారం కావడంతో ప్రజలు, వాహనదారులు అధిక సంఖ్యలో తమ తమ స్వస్ధలాలకు పయనమౌతున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి:Sabitha Indra Reddy: బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు.. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి

Exit mobile version