Site icon Prime9

KTR On IT Rides: నెక్ట్స్ ఏంటీ..? హిండెన్ బర్గ్ పై ఈడీ దాడులు చేయిస్తారా?

KTR

KTR

KTR On IT Rides: బీబీసీ ఇండియా కార్యాలయంపై ఐటీ దాడులు జరగడంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. గోద్రా ఘటనకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే.. ఆ సంస్థ పై ఐటీ దాడులు జరగడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.

‘ఓ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ బీబీసీ ఇండియా ఆఫీస్ లో సోదాలు విస్మయం కలిగించింది.

కేంద్రప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిన ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి ఏజెన్సీలు నవ్వుల పాలవుతున్నాయి.

ఇపుడు బీబీసీ తర్వాత.. అదానీ కంపెనీ చేసన ఆర్థిక మోసాలపై సంచలన వివరాలు వెల్లడించిన హిండెన్ బర్గ్ ఏజెన్సీ పై కూడా దాడులు చేస్తారా.. లేదంటే ఆ సంస్థ‌నే టేకోవ‌ర్ చేసుకుంటారా అని ఆయ‌న ఎద్దేవా చేశారు.

బీబీసీపై ఐటీ రెయిడ్స్‌కు సంబంధించి వివిధ మీడియా సంస్థ‌లు రాసిన క‌థ‌నాల‌ను ట్విటర్ లో ట్యాగ్ చేశారు కేటీఆర్.

 

ప్రశ్నిస్తే ఐటీ దాడులా?(KTR On IT Rides)

కాగా బీబీసీ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడుతోందన్న అనుమానంతో ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

సోదాల్లో భాగంగా సంస్థలోని సిబ్బంది ఫోన్లలన్నింటినీ పరిశీలించి.. వివరాలను సేకరించింది.

అయితే ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్ల వెనుక.. ఆయన హస్తం ఉందంటూ బీబీసీ ఇటీవల ఓ వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.

‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో ఈ డాక్యుమెంటరీని విడుదల చేసింది.

అయితే, గుజరాత్ మారణకాండకు సంబంధించి మోదీకి సుప్రీంకోర్టులో క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఇలా వివాదాస్పద డాక్యుమెంటరీ విడుదలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

దీంతో డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

ఈ పరిణామాలు జరిగిన తర్వాత ఐటీ దాడులు జరగడంపై ప్రతిపక్షాలు, జర్నలిస్టుల సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

కేంద్రాన్ని ప్రశ్నిస్తే ఐటీ, ఈడీ, సీబీఐ లతో దాడులు జరిపించడం ఏంటని మండిపడ్డాయి.

Exit mobile version