Site icon Prime9

Minister KTR: వారసత్వ రాజకీయాల పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

minister-ktr

minister-ktr

Hyderabad: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వారసత్వ రాజకీయాల పై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసత్వం అనేది రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మాత్రమే పని చేస్తుందని, ప్రతిభను నిరూపించుకోకపోతే రాజకీయాల్లో ఏ ఒక్కరూ రాణించలేరన్నారు. ప్రతిభ లేకుండా వారసత్వంతో రాజకీయాల్లో రాణించవచ్చని చాలా మంది అనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ఆ భావన తప్పు అని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీడియా ఇన్ తెలంగాణ ఫాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనే అంశంపై శనివారం జరిగిన చర్చలో కేటీఆర్ కీలక ప్రసంగించారు.

ఈ ప్రసంగంలో  రాజకీయ వారసత్వాన్ని ప్రస్తావించిన కేటీఆర్, వారసత్వం కేవలం రాజకీయాల్లోకి ప్రవేశాన్ని మాత్రమే ఇస్తుందన్నారు. అనంతరం సొంతంగా తమని తాము నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వ నాయకుడిని ప్రజలు భరించరని చెప్పారు. ఇందిరా గాంధీ లాంటి నేతలనే ప్రజలు ఓడించారని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో తన అంశాన్నే ఇందుకు ఉదాహరణగా కేటీఆర్  చెప్పుకొచ్చారు. తనకు తన పనితీరుతోనే సిరిసిల్లలో క్రమంగా మెజారిటీ పెరుగుతూ వస్తోందని, తాను సరిగ్గా పనిచేయకపోయి ఉంటే, సిరిసిల్ల ప్రజలు తనను ఎప్పుడో పక్కనపెట్టేవారని అన్నారు.

Exit mobile version
Skip to toolbar