KTR: హైదరాబాద్‌ అభివృద్ధిపై కేంద్రం వివక్ష- మంత్రి కేటీఆర్‌

KTR: హైదరాబాద్ అభివృద్ధిపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో హైదరాబాద్ రోజురోజుకి విస్తరిస్తోందని.. అయినా కేంద్రం సహకరించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లిలో చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

కేంద్రం వివక్ష చూపిస్తోంది..

హైదరాబాద్ అభివృద్ధిపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో హైదరాబాద్ రోజురోజుకి విస్తరిస్తోందని.. అయినా కేంద్రం సహకరించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా
శేరిలింగంపల్లిలో చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. నగరంలోని 185 చెరువుల అభివృద్ధిలో క్రెడాయ్‌ను భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. నగరంలోని నీటి అవసరాలు, సుందరీకరణ లక్ష్యంలో భాగంగానే ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్ నిర్మాణ రంగంతో పాటు.. ఫార్మా, పరిశ్రమల స్థాపనకు కేంద్రంగా మారుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఓఆర్‌ఆర్‌ వెలుపల కూడా నగరం భారీగా విస్తరిస్తోందని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 110 చెరువులు ఉన్నాయి. హైదరాబాద్‌లో పడిన వర్షం నీరు 94 శాతం మూసీలోకే వెళ్తుంది అని చెప్పారు. ఈ మేరకు ఆయన కేంద్రంపై మండిపడ్డారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై కావాలనే కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. మెట్రో విస్తరణకు కూడా కేంద్రం సహకరించడం లేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు.