Site icon Prime9

KTR: సీఎం తన సొంత మంత్రులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేయిస్తున్నారు…

KTR Challenges CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లనూ ట్యాపింగ్‌ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఒకవేళ తన ఆరోపణల్లో నిజం లేదంటే సీఎం రేవంత్‌ రెడ్డి కెమెరాల ముందు లైడిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని సవాలు విసిరారు. శుక్రవారంలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి ఎంపిక అనడం కంటే.. ప్రజలు మా ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని చెప్పాలన్నారు.

100 రోజుల్లోనే అనేక హామీలను నేరవేరుస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. “తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ అది కాంగ్రెస్ వల్లే జరగలేదు. అధికారం శాశ్వతమని మేమేప్పుడు అనుకోలేదు. ప్రజల అంచనాలు పెరగడమే మా ఓటమికి ఒక కారణమని తెలిపారు. దేశంలో పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్‌ పార్టీయే ఆజ్యం పోసింది. రాహుల్‌ గాంధీ ఢిల్లీలో రాజ్యాంగ ప్రతులను పట్టుకుని తమషా చేస్తుంటారు. అదే తెలంగాణలో రాజ్యంగం ఖూనీ అవుతుంటే మాత్రం మౌనం వహిస్తుంటారు” అని వ్యాఖ్యానించారు.

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందిస్తూ.. రేవంత్‌ రెడ్డే తన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేయిస్తున్నారన్నారు. ఒకవేళ అది అబద్ధమైతే నాతో పాటు కెమెరాల ముందు లైడిటెక్టర్‌ సిద్ధపడాలని సవాలు విసిరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. “ఈ ప్రభుత్వం తమ సొంత మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్‌లను ట్యాప్ చేయలేదా? అని రేవంత్‌ను అడుగుతున్నాను. దీనికి ఆయనను సమాధాన ఇవ్వమనండి. అధికార ప్రభుత్వంలోని, ప్రతిపక్షంలోని ఎవరెవరు ఫోన్లను రేవంత్‌రెడ్డి న్లు ట్యాప్ చేస్తున్నారో తెలుసు.  వీటన్నింటికి మేం గట్టి సమాధానం ఇస్తాం. మూడేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమే. తప్పకుండా రేవంత్‌ను వెంటాడతాం” అని పేర్కొన్నారు. అనంతరం గత ఎన్నికల్లో ఓటమిపై స్పందిస్తూ.. రాజాకీయాల్లో గెలుపు ఓటముల పట్ల చలించిపోయేతత్వం కేసీఆర్‌ది కాదన్నారు. తెలంగాణ భవిష్యత్తు కోసం ఆయన ఎప్పుడు పాటు పడుతుంటారన్నారు. అలాంటి కేసీఆర్‌కు ప్రజలు తప్పుకుండ మరోసారి అవకాశం ఇస్తారని నమ్ముతున్నామన్నారు.

Exit mobile version
Skip to toolbar