Hyderabad: ఒక పార్టీలో ఉంటూ, మరో పార్టీ అభ్యర్ధికి ఓటు వేయాలన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో పై కాంగ్రెస్ అధిష్టానం ఏఐసిసి ఆయన షోకాజ్ నోటీస్ జారీ చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో నవంబర్ 1న సీల్ట్ కవర్ లో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి సమాధానం ఇచ్చిన్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ గత నెల 22న 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలన్న నోటీసులో పేర్కొన్నారు.
అది ఫేక్ వీడియో, ఆ వాయిస్ నాది కాదు, మార్ఫింగ్ చేశారని ఆయన సమాధానం ఇచ్చారు. పార్టీలో నేను చాలా సీనియర్ ను, అయినా నాకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు, 35 ఏళ్లగా పార్టీకి విధేయుడిగా పని చేస్తున్నానని వివరణ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. విద్యార్ధి విభాగం నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Munugode by poll: మునుగోడు ఉప ఎన్నికల ఓటింగ్ లో రికార్డు..