Site icon Prime9

Khammam: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పేలుడు: ఇద్దరి మృతి, 10 మందికి గాయాలు

Khammam

Khammam

Khammam: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కార్యక్రమానికి నేతలు వస్తున్న సందర్భంగా బాణసంచా పేల్చారు. ఈ క్రమంలో బాణాసంచా నిప్పు రవ్వలు సమీపంలో ఉన్న పూరి గుడిసెపై పడ్డాయి. ఒక్క సారిగా మంటలు అంటుకోవడంతో అక్కడే ఉన్న పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా.. ఓ ఇంటిలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్ కు తరలించారు. ఈ సంఘటనలో ముగ్గురు కానిస్టేబుల్స్ రెండు కాళ్లు కోల్పోయారు.

బాణాసంచాతో నిప్పులు చెలరేగి(Khammam)

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కారేపల్లి మండలం చీమలపాడు లో బీఆర్ఎస్ ఆత్మీయ సమేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్యే రాములు హాజరయ్యారు. నాయకులు వస్తున్నారని పార్టీ కార్యకర్తలు బాణాసంచి కాల్చారు. ఆ బాణా సంచా నిప్పురవ్వలు పక్కనే గుడిసెపై పడటంతో మంటలు చెలరేగాయి. వాటిని అదుపు చేసేందుకు అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు నీల్లు చల్లి ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే మంటల తాకిడికి గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలింది. ఆ పేలుడు ధాటికి 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసు వాహనాల్లో ఖమ్మం తరలిస్తుండగా.. దారిలో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆత్మీయ సమ్మేళనాన్ని రద్దు చేసుకున్న ఎంపీ, ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లి పోయారు.

 

కేసీఆర్ దిగ్భ్రాంతి(Khammam)

చీమలపాడు లో జరిగిన ఘోర ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం  చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని రీతిలో సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలు పాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కేసీఆర్ జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కి, ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఎంపీ నామా నాగేశ్వర్ రావులకు ఫోన్లు చేసి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.

 

Exit mobile version