Site icon Prime9

Kavitha ED Trail: మార్చి 11 న విచారణకు ఈడీ గ్రీన్ సిగ్నల్..

kavitha vs ED

kavitha vs ED

Kavitha ED Trail: దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసు పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 11వ తేదీన ఈడీ విచారణకు హాజరు కానున్నట్టు కోరుతూ కవిత బుధవారం లేఖ రాశారు.

 

ఈడీ గ్రీన్‌సిగ్నల్‌

ఈ సందర్భంగా కవిత (MLC Kavitha)లేఖపై ఈడీ గురువారం ఉదయం స్పందన తెలియ జేసింది. ఆమె విజ్ఞప్తి మేరకు.. 11 న విచారణకు ఈడీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

శనివారం ఈడీ విచారణకు హాజరు అవ్వాలని తెలిపింది. దీంతో, ఈ విచారణపై ఉత్కంఠకు తెరపడనట్టు అయింది.

మరో వైపు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత, గురువారం మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

 

 

నిరసన కార్యక్రమాలపై  ప్రెస్ మీట్(Kavitha ED Trail)

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి నివాసంలో ఈ ప్రెస్ మీట్ జరుగనుంది. శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో.. అందుకు తగ్గట్టు కవిత సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.

మద్యం పాలసీ స్కాం కేసులో​ భాగంగా హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై, కవిత మాజీ సీఏ బుచ్చిబాబులతో కలిపి ఆమెను ఈడీ అధికారులు విచారించనున్నట్టు సమాచారం.

కాగా, కవితను ముందస్తు బెయిల్‌ కోసం బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరో వైపు మార్చి 10 (శుక్రవారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో కవిత పాల్గొంటారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకురావాలనే ప్రధాన డిమాండ్ తో ఈ ఆందోళన చేపట్టనున్నారు.

ఈ క్రమంలో ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులు, భారత్ జాగృతి నిరసన కార్యక్రమాలపై కవిత ప్రెస్ మీట్ ద్వారా స్పందించనున్నారు.

 

బీఆర్ఎస్ క్యాబినెట్ సమావేశం

బీఆర్ఎస్ పార్టీ క్యాబినెట్ సమావేశం శుక్రవారం జరుగనుంది. తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు , ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ర్ట కార్యవర్గ నేతలు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు తదితరులు హాజరవుతారు.

కవితకు ఈడీ నోటీసులు, ఇతర తాజా పరిణామాలపనై చర్చించే అవకాశం ఉంది.

అదే విధంగా ఎన్నికల ఏడాది కావడంతో.. ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ కార్యకలాపాలు, తదితర అంశాలపై చర్చించనున్నారు.

 

 

Exit mobile version