JP Nadda: బండి సంజయ్ మూడో విడత పాద యాత్ర ముగింపు సభకు నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు.. బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్‌గా నియమితులైన జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పాల్గొననున్నారు. దాంతో రాష్ట్ర బీజేపీ నేతలు.. సభా ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. బండి సభకు అనుమతి లేదని అధికారులు చెప్పడంతో.. బీజేపీ నేతలు హైకోర్టును అశ్రయించి అనుమతులు తీసుకున్నారు. ముగింపు సభకు భారీగా ప్రజలు రావచ్చని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.
బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారు. దాంతో ఆయన షెడ్యూల్ ను బీజేపీ ప్రకటించింది. జేపీ నడ్డా ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి.. 12.40 నిముషాలకు శంషాబాద్ కు సతీసమేతంగా వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అక్కడి నుంచి.. నోవాటెల్ హోటల్ ల్లో కాసేపు విశ్రాంతితీసుకుని.. మధ్యాహ్నం 2.40నిముషాలకు హెలికాప్టర్ లో వరంగల్ కు చేరుకుంటారు.
3 గంటలకు వరంగల్ భద్రకాళీ అమ్మవారి దర్శనం చేసుకుని.. 4గంటల నుంచి 5.40 వరకు పాదయాత్ర ముగింపు సభలో పాల్గొంటారు. అనంతరం 6గంటలకు.. వరంగల్ నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చి.. సాయంత్రం 6.30గంలకు శంషాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు.