Jagga Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతే ఇందుకు కారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేను ఆయన కలిశారు. బాధ్యతలు తీసుకున్న కారణంతో మర్యాదపూర్వకంగానే ఆయనను కలిసినట్టు జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయ అంశాలపై చర్చించినట్టు తెలిపారు. బీఆర్ఎస్ , బీజేపీలను ఏ విధంగా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలనే అంశాలపై సమాలోచనలు జరిపినట్టు చెప్పారు.
అయితే పార్టీలోని అంతర్గత విషయాలపై తమ మధ్య చర్చ జరగలేదని.. ఠాక్రే అనుభవం తెలంగాణ కాంగ్రెస్‌కు ఉపయోగపడుందన్నారు.
రాష్ట్రంలోని 70 స్థానాల్లో విజయం కోసం పనిచేస్తామని తెలిపారు. కాంగ్రెస్ బలం, బలహీనతను ఠాక్రేకు వివరించానిని.. చాలా మంది సీనియర్లు పాదయాత్ర షెడ్యూల్ ఇచ్చారన్నారు.
తన పాదయాత్ర రూట్ మ్యాప్‌ను త్వరలో తెలియజేస్తానని తెలిపారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి నష్టం జరిగేలా తానేం మాట్లాడలేదని జగ్గారెడ్డి అన్నారు.
ఆయన చెప్పింది ఒకటైతే.. మీడియాలో వచ్చింది మరొకటని.. ప్రజలకు అది మరోలా అర్థమైందన్నారు.
ఎవరు ఏం మాట్లాడినా కాంగ్రెస్‌కు నష్టం జరగదని.. పార్టీకి నష్టం జరిగేలా కోమటిరెడ్డి మాట్లాడలేదని జగ్గారెడ్డి అన్నారు.
కొద్ది రోజులుగా కాంగ్రెస్ కు.. మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన తమ్ముడు భాజపాలో చేరడం..
మునుగోడులో కాంగ్రెస్ కు ప్రచారం చేయకపోవడం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడిప్పుడే మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఒంటిరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్నారు.
దీంతో కాంగ్రెస్ కు వేరేమార్గం లేదని.. మరొకరితో కలవాల్సిందేనని అన్నారు. ఎన్నికల తర్వాత ఈ విషయం గురించి చర్చిస్తామని.. వచ్చే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని వివరణ ఇచ్చారు