Site icon Prime9

It Raids : మాజీ ఎంపీ, కాంగ్రెస్ చెన్నూర్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు..

it raids on congress chennor mla candidate vinod

it raids on congress chennor mla candidate vinod

It Raids : తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న క్రమంలో పరిస్థితులన్నీ వాడి వేడిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల వరుసగా కాంగ్రెస్ నేతల ఇల్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కక్షపూరితంగానే ఇలా కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు. కాగా రీసెంట్ గానే పొంగులేటి ఇళ్ళు, ఆఫీస్ లపై దాడులు జరగగా.. ఇప్పుడు తాజాగా మరో కీలక నేతని ఐటీ అధికారులు టార్గెట్ చేశారు.

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. సోమాజీ గూడాలోని వివేక ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అదే విధంగా మంచిర్యాల లోని నివాసం, కార్యాలయాలు, అనుచరులు, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఐదు రోజుల క్రితం వివేక్ కంపెనీలో అధికారులు రూ. 8 కోట్లు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే దాడులు జరుగుతున్నట్లుగా సమాచారం.

ఈ మేరకు చెన్నూరులోని వివేక్ ఏంటి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో చెన్నూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎంపీ వివేక్ మొన్నటివరకు బీజేపీలో ఉన్నారు. ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు పార్టీ మారగానే టార్గెట్ చేశారని అంటున్నారు. ఆదాయపు పన్నుశాఖ కాంగ్రెస్ నేతల టార్గెట్ గానే దాడులకు దిగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Exit mobile version