Hyderabad: తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ప్రలోభాల డీల్ కేసు పై మంత్రి కేటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్వరలో పాన్ ఇండియా సినిమా తరహాలో చూస్తారని ఆయన అన్నారు. ఎవరూ ఊహించని, నిర్గాంతపోయే సన్నివేశాలు ఉంటాయని అన్నారు. ఈమేరకు కేటిఆర్ మీడియాతో ముచ్చటించారు.
మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలన్న బీజేపీ కుట్రను సీఎం కేసీఆర్ భగ్నం చేశారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లే తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నిందన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన మొత్తం సినిమా త్వరలో విడుదల కానుందన్నారు. అయితే ఇందులో ఓ విషయాన్ని కొసమెరుపుగా భావించాలి. పోలీసులు కంటే ముందుగా టిఆర్ఎస్ శ్రేణులు, మంత్రులు ఆడియో, వీడియోల గురించి పేర్కొంటున్నారు. కానీ ఎంత నగదు సంఘటనా ప్రాంతంలో పట్టుబడింది అన్న విషయాలను మాత్రం ఇటు పోలీసులు, అటు టిఆర్ఎస్ పార్టీ పెద్దగా పేర్కొనడం లేదు. మునుగోడు ఉప ఎన్నికలు నేటితో అయిపోయాయి. ఇక పై భాజపా, తెరాస శ్రేణుల మద్య ప్రలోభాల కేసు నలగనుంది.
ఇది కూడా చదవండి: TRS MLAs poaching case: శాసనసభ్యుల కొనుగోలు ప్రలోభాల డీల్ కేసు.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన నిందితులు