Hyderabad: మలక్ పేట్ లో వారం రోజుల క్రితం.. మెుండెం లేని తల లభ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మలక్ పేట్ పరిధిలోని తీగలగూడ వద్ద మెుండెం లేని తల కేసులో.. మృతురాలు ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న అనురాధ అనే నర్సుగా గుర్తించారు. ఈమె వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు బంధువులు వెల్లడించారు.
మలక్ పేట్ లో వారం రోజుల క్రితం.. మెుండెం లేని తల లభ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మలక్ పేట్ పరిధిలోని తీగలగూడ వద్ద మెుండెం లేని తల కేసులో.. మృతురాలు ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న అనురాధ అనే నర్సుగా గుర్తించారు. ఈమె వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు బంధువులు వెల్లడించారు.
గతవారం.. మూసీ పరివాహక ప్రాంతంలో నల్లటి కవర్ లో గుర్తు తెలియని మహిళ తల లభ్యమైంది. మెుండెం లేని తల లభ్యం కావడంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికి మృతురాలని పోలీసులు గుర్తించి.. కేసును ఛేదించారు.
నగదు లావాదేవీల విషయంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య చేసిన అనంతరం.. మతురాలి శరీరాన్ని ముక్కలుగా చేసి.. హంతకుడు ఫ్రిడ్జ్ లో దాచాడు. చైతన్యపురిలో ఈ హత్య జరగ్గా.. తలను మూసీ పరివాహక ప్రాంతంలో పడేశాడు. ఈ మేరకు నిందితుడు.. చంద్రమోహన్ ఇంటిలో దాచిపెట్టిన శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు.