Prime9

Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌..

Telangana Secretariat : తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆలయ ప్రారంభోత్సవంలో గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ కలిసి పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయాన్ని గవర్నర్‌తో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలానే ఈ కార్యక్రమంలో మంత్రులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అయితే ముందుగానే సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ తర్వాత వచ్చిన గవర్నర్ కు సాదర స్వాగతం పలికారు. ఆమెతో కలిసి సీఎం కేసీఆర్ నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చర్చి, మసీదులను కూడా ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత గవర్నర్ ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మానించి జ్ణాపికలు అందజేశారు.

కొత్త సచివాలయం నిర్మించిన తర్వాత ఆ ప్రాంగణంలోకి గవర్నర్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. సచివాలయ ప్రారంభోత్సవం సమయంలో తనకు ఆహ్వానం లభించలేదని గవర్నర్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం కేసీఆర్.. గవర్నర్ తో 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగానే సచివాలయంలో ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవాలకు ఆహ్వానించగా గవర్నర్ హాజరయ్యారు.

 

 

Exit mobile version
Skip to toolbar