Fire Accident: హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఎండకాలం కావడంతో.. వీటి తీవ్రత ఎక్కువ అవుతుంది. తాజాగా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మల్లాపూర్ పారిశ్రామికవాడలో జేపీ ఇండస్ట్రీస్ కంపెనీలో అగ్గిరాజుకుంది.
భారీ అగ్నిప్రమాదం..
హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఎండకాలం కావడంతో.. వీటి తీవ్రత ఎక్కువ అవుతుంది. తాజాగా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మల్లాపూర్ పారిశ్రామికవాడలో జేపీ ఇండస్ట్రీస్ కంపెనీలో అగ్గిరాజుకుంది.
వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవలే స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు మరణించారు. ఆ ఘటన మరవకముందే.. మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పారిశ్రామికవాడలో జేపీ ఇండస్ట్రీస్ కంపెనీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
పొగ దట్టంగా వ్యాపించింది. దీంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు పరుగులు తీశారు. ప్రమాద స్థలికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి.
పొగ దట్టంగా వ్యాపించడంతో.. మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరిశ్రమలో కెమికల్ ఉండటంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.