Fire: హైదరాబాద్ లో ఘోరం జరిగింది. అగ్నిప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా.. దంపతులు సజీవ దహనమయ్యారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చిన్నారి మృతి చెందడం.. అందరినీ కలచివేసింది.
ముగ్గురు సజీవ దహనం..
హైదరాబాద్ లో ఘోరం జరిగింది. అగ్నిప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా.. దంపతులు సజీవ దహనమయ్యారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చిన్నారి మృతి చెందడం.. అందరినీ కలచివేసింది. హైదరాబాద్ లోని కుషాయిగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో.. ముగ్గురు సజీవ దహనమయ్యారు. టింబర్ డిపోలో వేకువజామున 3 గంటలకు అగ్నిప్రమాదం జరగింది. ఈ మంటలు పక్కనే ఉన్న భవనానికి వ్యాపించాయి. దీంతో అందులో నివాసముంటున్న దంపతులు సహా వారి చిన్న కుమారుడు మృతిచెందారు. టింబర్ డిపోలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలుడుతోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్ (35), సుమ(28), జోషిత్(5)గా గుర్తించారు. మరో చిన్నారి ఆచూకీ తెలియలేదు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.