Site icon Prime9

Fire Accident : నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి

fire accident at nampally causes 7 death

fire accident at nampally causes 7 death

Fire Accident : హైదరాబాద్ లోని నాంపల్లిలో గల బజార్ ఘాట్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మృతి చెందగా.. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకొని 6 వాహనాల్లో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. తెల్లవారుజామున మంటలు చెలరేగగా… కొన్ని సెకన్ల వ్యవధిలోనే పొగ నాలుగో అంతస్తు వరకు వ్యాపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆ భవనంలో మొత్తం 60 మంది నివసిస్తున్నట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు  నాలఉగు నెలల చిన్నారి కూడా ఉండడం మరింత శోచనీయంగా భావిస్తున్నారు.

నాలుగు అంతస్తుల ఈ అపార్ట్ మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో గ్యారేజ్‌ ఉండటంతో కారు రిపేర్‌ చేస్తుండగా మంటలు వచ్చాయి. అదే సమయంలో అక్కడ డీజిల్‌, కెమికల్‌ డ్రమ్ములు ఉండటం.. వాటికి మంటలు అంటుకోవడంతో అవి నాలుగో అంతస్తు వరకు వేగంగా వ్యాపించాయని తెలుస్తుంది. జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. నిచ్చెనల సహాయంతో భవనంలోని మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో 21 మంది అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వారిలో 10 మంది అపస్మారస్థితిలో ఉన్నారని చెప్పారు. వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

 

ఘటనా స్థలం బయట పార్క్ చేసిన ఆరు ద్విచక్ర వాహనాలు, కారు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సదరు బిల్డింగ్ పక్కనే ఉన్న భవనానికి కూడా మంటలు వ్యాపించాయి. ఘటనాస్థలాన్ని డీసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. 16మందిని రెస్క్యూ చేశామని తెలిపారు. కెమికల్స్ వల్లే షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని అంటున్నారు. బిల్డింగ్ పర్మిషన్లపై కూడా ఓనర్లను సంప్రదించి చర్యలు చేపడతామని.. ప్రమాద ఘటనపై విచారణ చేపడతామని వెల్లడించారు.

Exit mobile version