Site icon Prime9

Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహానికి తుది మెరుగులు

congress-telangana-talli

Hyderabad: తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాని పురస్కరించుకుని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచన మేరకు గాంధీ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కళాకారుడు రాజు తెలంగాణ తల్లి విగ్రహనికి తుదిమెరుగులు దిద్దుతున్నాడు. కూకట్ పల్లి బాలానగర్ లో ఆదిత్య ఆర్ట్స్ విగ్రహాల తయారీ కేంద్రంలో శిల్పి రాజు ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా తెలంగాణ మహిళల వేషదారణతో, తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేస్తున్నామని కళాకారుడు రాజు తెలిపారు. టి. పి. సి. అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచన మేరకు విగ్రహాన్ని తయారు చేస్తున్నామని చేతిలో జొన్నకర్ర, కొప్పులో మల్లెపూలతో తెలంగాణ మహిళల వేషధారణ ఉట్టిపడేలా విగ్రహాన్ని తయారుచేసి ఇస్తున్నామన్నారు.

ఇంతకు ముందు కేసిఆర్ సూచన మేరకు రాష్ట్రంలో మొత్తంలో దాదాపు 400 తెలంగాణ తల్లి విగ్రహాలు తయారుచేసి ఇచ్చామని అన్నారు. ఇంకా ఎందరో మహానుభావుల విగ్రహాలు కూడా తయారుచేశామని అన్నారు.

Exit mobile version