Site icon Prime9

Munugode by poll: మునుగోడు ఉప ఎన్నికకు సర్వం సిద్ధం.. సీఈవో వెల్లడి

Everything is ready for the Munugode by-election...CEO reveals

Everything is ready for the Munugode by-election...CEO reveals

Munugode: నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో ప్రత్యేకంగా సమావేశమైనారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,855 కాగ, ఇందులో 50 మంది స‌ర్వీస్ ఓట‌ర్లు, 5,686 పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు ఉన్న‌ాయన్నారు. కేవ‌లం 739 మంది పోస్టల్ బ్యాలెట్లకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారన్నారు. అర్బ‌న్‌లో 35, రూర‌ల్‌లో 263 పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

సమస్యాత్మక ప్రాంతాలుగా 105 ఉన్నట్లు గుర్తించామన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తైందన్నారు. ఆన్ లైన్ లో కూడా ఓటర్లు స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. తొలిసారి కొత్త నమూనా ఓటరు కార్డులను పంపిణీ చేసిన్నట్లు వికాస్ రాజ్ తెలిపరాు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉందన్నారు.

ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగనుంద‌ని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ స్టేష‌న్ల‌లో మెడిక‌ల్ టీమ్స్‌ను అందుబాటులో ఉంచామ‌న్నారు. 3,366 పోలీసులు, 15 కంపెనీల‌ కేంద్ర బ‌ల‌గాలు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో 100 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు పలు తనిఖీల్లో రూ. 6.80 కోట్ల న‌గ‌దు పట్టుబడ్డాయన్నారు. 4500 లీట‌ర్ల మ‌ద్యం సీజ్ చేశామ‌న్నారు. రేపు సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తామ‌న్నారు. ప్రత్యేక యాప్ ద్వారా గంట గంట‌కు ఓటింగ్ శాతాన్ని తెలియ‌జేస్తామ‌న్నారు. రేపు సాయంత్రం 6 త‌ర్వాత బ‌ల్క్ మేసేజ్‌లు వ‌స్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. బ‌య‌ట‌ నుంచి వ‌చ్చిన‌వారు నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌కూడ‌దు.

ఇది కూడా చదవండి: Munugode by poll: జూబ్లీహిల్స్ వద్ద రూ. 89.91లక్షలు పట్టివేత

 

Exit mobile version