Hyderabad: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరోసారి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో ఈడీ అధికారుల తనిఖీలు చేపట్టారు. 25 బృందాలుగా ఏర్పడి ఈడీ సోదాలు చేస్తున్నారు. ఈడీ అధికారుల ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి.
సంచలనంగా నిలిచిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ వేగవంతం చేసింది. కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న వారి ఇండ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేస్తోంది. హైదరాబాద్ తోపాటు ముంబు, బెంగళూరు వంటి నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది. అయితే, ఈ కేసులో ముందునుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీలోని మనీష్ సిసోడియా ఇంట్లో మాత్రం ఎలాంటి సోదాలు చేయడం లేదని ఈడీ తెలిపింది. మరోవైపు ఈ కేసుతో సంబంధం లేదని మనీష్ సిసోడియా చెప్తున్నారు.
గతంలో హైదరాబాద్‌లో రెండుసార్లు తనిఖీ చేసిన అధికారులు. ఈరోజు మూడోసారి సోదాలు నిర్వహించారు. నగరంలోని రాయదుర్గం సహా పలు ప్రాంతాల్లో ఈడీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. గతంలో కోకాపేటలోని రామచంద్ర పిళ్లై ఇల్లు, నానక్‌రామ్‌గూడలోని ఆఫీస్‌లలో సోదాలు చేసిన ఈడీ, ఇప్పుడు రాయదుర్గంలో తనిఖీలు చేపట్టింది. బీజేపీ నేతలు ఢిల్లీలో స్టింగ్ ఆపరేషన్ వీడియోలు మీడియాకు రిలీజ్ చేసిన మరుసటి రోజే ఈడీ సోదాలు చేపడుతోంది. రాబిన్ డిస్టలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ ఎల్.ఎల్.పి. పేరుతో రామచంద్ర పిళ్లై కంపెనీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీల్లో అభిషేక్ బోయిన్‌పల్లి, గండ్ర ప్రేమ్‌సాగర్‌రావు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.