Site icon Prime9

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

ed-notice-to-mlc-kabvitha

Hyderabad: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఉదయం నుంచి కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. ఎమ్మెల్సీ కవిత పర్సనల్ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు కార్యాలయంలో దాడులు చేస్తున్నారు. గోరంట్ల అసోసియేట్స్ కార్యాలయంలో రెండు ఈడీ బృందాల దాడులు నిర్వహిస్తున్నాయి. ఉదయం ఆరుగంటలకే ఓ ఈడీ బృందం వచ్చినట్లు తెలుస్తోంది. కాసేపటి క్రితం గోరంట్ల అసోసియేట్స్ కార్యాలయానికి వచ్చిన మరో బృందం సోదాలు చేస్తోంది.

హైదరాబాద్‌లోని దోమలగూడలోని అరవింద్ నగర్ శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలో కవిత ఆడిటర్ నివాసముంటున్నారు. నలుగురు ఈడీ అధికారుల నేతృత్వంలో సాయి కృష్ణా రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబునివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. బుచ్చిబాబు గతంలో కవితకు అకౌంటెంట్‌గా ఉన్నారు. గచ్చిబౌలిలో అభినవ్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.

లిక్కర్ స్కామ్ కు సంబంధించి దేశవ్యాప్తంగా 40కి పైగా ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది

Exit mobile version