Site icon Prime9

Rahul Gandhi: అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు.. రాహుల్ గాంధీ

Dharani

Dharani

Hyderabad: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్ రైతులకు గుదిబండగా మారిందని రైతు సంఘాల నేతలు రాహుల్ గాంధీ దృష్టికి తెచ్చారు.

భారత్ జోడో యాత్రలో భాగంగా గురువారంనాడు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు, కౌలు రైతులతో రాహుల్ గాంధీ సమావేశ మయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి రైతులు రాహుల్ గాంధీతో సమావేశానికి హాజరయ్యారు. రైతుల సమస్యలను రాహుల్ గాంధీ విన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై తమ పార్టీ ఒత్తిడి తీసుకువస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ను అమలు చేస్తామన్నారు. ఆత్మహత్యచేసుకున్న రైతు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాగానే ఆర్ధిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతుల సమస్యలకు కూడా పరిష్కారం చూపుతామన్నారు.

రెండు వారాల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో సాగనుంది. తెలంగాణ రాష్ట్రం నుండి పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 300 కి.మీ.పైగా పాదయాత్ర సాగుతుంది.

Exit mobile version