Hyderabad:హైదరాబాద్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా హై కోర్టు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అందరూ చూస్తుండగానే..కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
A man was murdered by unidentified men in broad daylight near Gate No.6 of the Telangana High Court in Hyderabad today.
A dispute over payment of ₹10,000 between the accused and the victim is suspected to have led to the murder.#Hyderabad #Telangana pic.twitter.com/iqMkPKpPlS— Surya Reddy (@jsuryareddy) May 4, 2023
కత్తితో పొడిచి..
హైదరాబాద్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా హై కోర్టు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అందరూ చూస్తుండగానే..కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. హై కోర్టు గేట్ నెంబర్ 6 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. డబ్బుల విషయంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
జనం చూస్తుండగానే కత్తితో పొడిచి దుండగుడు పరారయ్యాడు. రూ.10 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ హత్యతో స్థానికులు.. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని స్థానికంగా ఉన్న సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న మిథున్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.