Site icon Prime9

Rangareddy: హైదరాబాద్ లో దారుణం.. కిడ్నాప్ కు గురైన వ్యక్తి దారుణ హత్య

shocking murder case happened in bihar

shocking murder case happened in bihar

Rangareddy: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కిడ్నాప్ కు గురైన మాజీ విలేకరి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి శివారు కొత్తూరు పరిధిలో చోటుచేసుకుంది. ఈ హత్యలో ఓ రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నట్లు.. మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

చిత్ర హింసలు.. దారుణ హత్య

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కిడ్నాప్ కు గురైన మాజీ విలేకరి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి శివారు కొత్తూరు పరిధిలో చోటుచేసుకుంది. ఈ హత్యలో ఓ రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నట్లు.. మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి కారులో వెళ్తుండగా.. కొత్తూరు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం చిత్రహింసలు పెట్టి.. గచ్చిబౌలి వద్ద దారుణంగా హత్య చేశారు. ఈ హత్యను ఆత్మహత్యగా సృష్టించడానికి ప్రయత్నించి దొరికిపోయారు.

ఆక్సిడెంట్ గా నాటకం.. (Rangareddy)

కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని హత్య చేసిన తర్వాత.. ప్రమాదంగా చిత్రీకరించడానికి నిందితులు ప్రయత్నించారు.

భూ తగాదాల వల్లే హత్య చేశారని.. మృతుడి తల్లి వాపోయింది. కుమారుడి దారుణ హత్యతో.. తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

రాజకీయ నాయకుడి వ్యక్తులే ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి కారులో వెడుతుండగా చేగూర్ దగ్గర ఆదివారం కారును కొంతమంది అడ్డగించి కిడ్నాప్ చేశారు.

ఆ తరువాత కరుణాకర్ రెడ్డిని కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా కొట్టి అనంతరం కాళ్లు చేతులు విరిచేసినట్లుగా తెలుస్తోంది.

దారుణంగా చంపి కారు యాక్సిడెంట్ గా క్రియేట్ చేసి తరువాత గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు.

అక్కడి డాక్టర్లు అప్పటికే కరుణాకర్ రెడ్డి మృతి చెందాడని తెలిపారు. దీంతో నిందితులు అక్కడనుంచి పరారయ్యారు.

ఓ భూమి వివాదంలో కరుణాకర్ రెడ్డికి విభేధాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

కొంతమందితో కలిసి కరుణాకర్ రెడ్డి హత్యకు రెక్కి నిర్వహించినట్లు సమాచారం.

ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.

 

Exit mobile version