Murder: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త భార్యను వెంటాడి మరి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన శేరిలింగంపల్లిలో చోటు చేసుకుంది. ఈ హత్యతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటడి మరి.. కత్తితో గొంతుకోసి హత్య చేశాడు.
దారుణ హత్య.. (Murder)
మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్న పెద్దగా మార్పు రావడం లేదు. దీంతో పాటు.. హైదరాబాద్ లో మహిళలపై వరుస ఘటనలు కలవరపెడుతున్నాయి. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్న మార్పు రావట్లేదు.
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త భార్యను వెంటాడి మరి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన శేరిలింగంపల్లిలో చోటు చేసుకుంది. ఈ హత్యతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటడి మరి.. కత్తితో గొంతుకోసి హత్య చేశాడు.
శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్లలో ఈ దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్ల ప్రాంతానికి చెందిన అంబిక (26), నరేందర్ భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య కలహాలు ఉండటంతో వేరువేరుగా ఉంటున్నారు. అంబిక నల్లగండ్లలో, నరేందర్ తాండూరులో నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో.. నల్లగండ్లకు వచ్చిన నరేందర్ భార్యతో గొడవపడ్డాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన భర్త.. తొలుత రాయితో భార్య తలపై బాదాడు. గాయంతో అంబిక పరుగు తీయగా.. నరేందర్ ఆమె వెంటపడి మరీ కత్తితో గొంతుకోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై శేరిలింగంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల పాప ఉన్నట్లు స్థానికులు తెలిపారు.