Site icon Prime9

Sharmila: షర్మిలకు 14 రోజుల రిమాండ్.. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

YS Sharmila

YS Sharmila

Sharmila:షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. రాత్రి నాంపల్లి కోర్టులో షర్మిలను పోలీసులు హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం సోమవారం షర్మిలకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే మంగళవారం అదే నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్ మంజూరు.. (Sharmila)

డ్యూటీలో ఉన్న పోలీసుల ఆఫీసర్స్ పై చేయి చేసుకున్నందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో సహా మరో ఇద్దరిపై కేసు నమోదు అయింది. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న కారణంగా ఐపీసీ 332, 353 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు అయింది. ఈ కేసులో ఏ1 గా వైఎస్ షర్మిల, ఎ2గా ఆమె కారు డ్రైవర్ బాలు , ఏ3 గా మరో డ్రైవర్ జాకబ్‌లుగా చేర్చారు. డ్రైవర్ బాలును అరెస్టు చేయగా.. మరో డ్రైవర్ జాకబ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నాంపల్లి కోర్టు షర్మిలకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది.

నాంపల్లి కోర్టు వైఎస్ షర్మిలకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. బెయిల్ కొరకు.. నిన్ననే పిటిషన్ దాఖలు చేశారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం..షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్‌టీపీ తరపున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు షర్మిల పిలుపు ఇచ్చారు.

షర్మిలను పరామర్శించిన విజయమ్మ

చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ షర్మిలను ఆమె తల్లి విజయమ్మ పరామర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం తేదా అని విజయమ్మ అన్నారు.

ప్రభుత్వం అండతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ ఆశయ సాధన కోసమే షర్మిల పోరాటం చేస్తోంది.

ప్రభుత్వాలను ప్రశ్నించడమే మా తప్ప. ప్రశ్నించే వారిని ఇంకా ఎంతకాలం అణచివేస్తారు? అని విజయమ్మ పేర్కొన్నారు.

సిట్‌ కార్యాలయానికి ఒంటరిగా వెళ్లి, సిట్‌ అధికారిని కలిసి టీఎస్‌పీఎస్‌సీ దర్యాప్తు మీద వినతిపత్రం ఇవ్వాలని అనుకున్నా.

నన్ను బయటకు రాకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు.

నేనేమైనా క్రిమినల్‌నా..? నాకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా..? పోలీసులు నాపై అనుచితంగా ప్రవర్తించారు.

నా మీద పడితే నేను భరించాలా..? ఆత్మరక్షణ చేసుకోవడం నా బాధ్యత అని షర్మిల అన్నారు.

Exit mobile version